Raithu Runamafi : నేడు రూ.లక్షలోపు రైతు రుణాలు మాఫీ

by Sathputhe Rajesh |   ( Updated:2024-07-18 07:17:57.0  )
Raithu Runamafi : నేడు రూ.లక్షలోపు రైతు రుణాలు మాఫీ
X

దిశ, వెబ్‌డెస్క్: నేడు తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు రూ.లక్షలోపు రైతు రుణాలు మాఫీ చేయనుంది. సాయంత్రం 4 గంటలకు రుణమాఫీ ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. నేరుగా 11.50 లక్షల మంది రైతుల రుణ ఖాతాల్లోకి నిధులు జమ కానున్నాయి. ఇప్పటికే బ్యాంకులకు ఆర్థిక శాఖ నిధులు జమ చేసింది. ఆగస్టు పూర్తయ్యేలోపు 3 దశల్లో రైతుల రుణమాఫీ ప్రక్రియ జరగనుంది. ఈ నెలఖారులోపు రూ.1.50 లక్షల వరకు ఉన్న రుణాలు మాపీ కానున్నాయి. ఆగస్టు 15 నాటికి రూ.2లక్షల వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ కానున్నాయి. కుటుంబాన్ని నిర్ధారించేందుకే ప్రామాణికంగా రేషన్ కార్డును చూడనున్నారు.

అయితే సుమారు 6.36 లక్షల మంది రైతులకు రేషన్ కార్డులు లేనట్లు అధికారులు గుర్తించారు. ఇవాళ గ్రామ, మండల కేంద్రాల్లో రుణమాఫీ సంబురాలు చేపట్టనున్నారు. మరోవైపు మధ్యాహ్నం ప్రజాభవన్‌లో బ్యాంకర్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం కానున్నారు. రుణమాఫీపై బ్యాంకర్లతో భట్టి చర్చించనున్నారు. రుణమాఫీ డబ్బులు ఇతర ఖాతాలకు మళ్లించవద్దని భట్టి సూచించనున్నారు. కాగా, జిల్లాల్లో రుణమాఫీ కార్యక్రమంలో మంత్రులు పాల్గొననున్నారు. నేడు రుణమాఫీ చేయనున్నందున ఇప్పటికే పలు గ్రామాల్లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులు పాలాభిషేకాలు చేస్తు్న్నారు.

Advertisement

Next Story