నేడు అంతర్జాతీయ లింగమార్పిడి దినోత్సవం

by sudharani |
నేడు అంతర్జాతీయ లింగమార్పిడి దినోత్సవం
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ లింగమార్పిడి దినోత్సవం ప్రతి ఏడాది మార్చి 31 న నిర్వహించబడుతుంది. సమాజంలో ట్రాన్స్ జెండర్స్ ఎదుర్కొంటున్న వివక్ష, సమస్యలు, వారు సమాజానికి చేసిన కృషి వీటిని గుర్తు చేసుకునేందుకు ఈ రోజుని ప్రపంచ లింగమార్పిడి దినోత్సవంగా జరుపుకుంటున్నారు. మొట్టమొదటి సారిగా 2009లో మిచిగాన్‌కు చెందిన ట్రాన్స్ జెండర్ కార్యకర్త రాచెల్ క్రాండాల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఆ తర్వాత 2014 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు ట్రాన్స్ జెండర్లు ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు. వారికున్న సమస్యలు, ఎదుర్కొంటున్న వివక్షను గురించి చర్చించుకుంటారు. అయితే ఇప్పటికే ట్రాన్స్ జెండర్లు అనేక రంగాలలో రాణిస్తున్నారు. సామాన్య ప్రజలతో పాటు వారికి కూడా సమాన హక్కులు కల్పిస్తున్నాయి ప్రభుత్వాలు. అయినప్పటికీ కొంతమంది ట్రాన్స్ జెండర్లు ఇంకా లింగ వివక్షను ఎదుర్కొంటున్నారు.

Advertisement

Next Story