- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'సకాలంలో వైద్య సేవలు అందించాలి'
దిశ , నారాయణపేట: జిల్లా ఆసుపత్రికి వచ్చే రోగులను ఆదరించి సరైన సమయంలో వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష వైద్య సిబ్బందిని ఆదేశించారు. శనివారం ఉదయం జిల్లా ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చే రోగులు తమ ఆరోగ్య సమస్యలతో బాధ పడుతూ వస్తారని వారికి సకాలంలో నాణ్యమైన వైద్యాన్ని అందించాలన్నారు. వైదులు సమయ పాలన పాటించాలన్నారు. ఆసుపత్రిలో ఉన్న వివిధ వైద్య విభాగాలను పరిశీలించారు. అనంతరం ఓ.పి వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆర్థో, డెంటల్, ప్రసూతి వార్డులను తనిఖీ చేశారు. అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఎక్స్ రే, రక్త పరీక్షలు ఇతరత్ర పరీక్షలు నిర్వహించి వారికి సరైన వైద్యం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంజిత్ కుమార్, డాక్టర్ పావని తదితరులు పాల్గొన్నారు.
జాబితాలో పేర్లు నమోదు చేయించుకోవాలి..
18 ఏండ్లు నిండిన యువతీ యువకులు ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో డిసెంబర్3, 4 తేదీలలో ఓటరు నమోదుకు ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తున్న దృష్ట్యా కలెక్టర్ శనివారం ఉదయం పట్టణంలోని పోలింగ్ బూత్ సంఖ్య 147, 148, 149, 150, 151 లను తనిఖీ చేశారు. జిల్లాలో 90 పోలింగ్ స్టేషన్ ఉన్నాయన్నారు. బీఎల్‌ఓ లు వార్డులలో సేకరించిన వివరాలను గరుడా యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. చనిపోయిన వారి వివరాలను సైతం సేకరించి నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రామచందర్ నాయక్, తహసీల్దార్ దానయ్య తదితరులు పాల్గొన్నారు.