బ్రేకింగ్: టీ-బీజేపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఫిక్స్

by Satheesh |   ( Updated:2023-11-13 10:32:14.0  )
బ్రేకింగ్: టీ-బీజేపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఫిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 17వ తేదీన బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యాటనకు రానున్నారు. అదే రోజు మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. సోమాజిగూడలోని బీజేపీ మీడియా సెంటర్‌లో అమిత్ షా టీ- బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేయనున్నారు. అనంతరం అమిత్ షా రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. పోలింగ్ తేదీ సమీపిస్తుండంతో ప్రచారం స్పీడప్ చేయనున్నారు. 17వ తేదీ ఒకేరోజున అమిత్ షా నాలుగు సభల్లో పాల్గొననున్నారు. నల్లగొండ, వరంగల్, గద్వాల్, రాజేంద్రనగర్‌లో జరిగే పబ్లిక్ మీటింగ్స్‌కు అమిత్ షా హాజరకానున్నారు.

Advertisement

Next Story