- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tiger : మంచిర్యాల జిల్లాలో పులి సంచారం..వైరల్ గా వీడియో
దిశ, వెబ్ డెస్క్: మంచిర్యాల జిల్లా (Manchiryala district) కాసిపేట మండలం పెద్ద ధర్మారం సమీపంలో పెద్దపులి(Tiger )సంచరిస్తున్న అంశం వెలుగుచూసింది. గ్రామానికి అతి సమీపంలో రహదారిపై పులి ఠీవిగా నడుస్తూ వెలుతున్న వీడియో వైరల్ గా మారింది. పులి కనిపించడంతో అక్కడి గ్రామ ప్రజలు ఉలిక్కిపడ్డారు. పంట పొలాల్లో ఉన్న రైతులకు పెద్దపులి అరుపులు వినిపించినట్లు తెలిపారు. అటవీ శాఖ సిబ్బందిని అధికారులు అప్రమత్తం చేశారు. వ్యవసాయ కూలీలు, పశువుల కాపర్లు అడవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని సూచించారు. పెద్దపులి సంచారంతో ధర్మారం సహా పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. పదిహేను రోజుల నుంచి జన్నారం మండలంలోని కవ్వాల్ అటవీ ప్రాంతం మీదుగా లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాల్లోని ధర్మారం బీట్ పరిధిలో పెద్దపులి సంచరిస్తుందని వాటి పాదముద్రల ఆధారంగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు.
తాజాగా గత ఆదివారం అటవీ పరిధిలోని మేడారం సెక్షన్‌లో మేతకు వెళ్లిన ఆవులపై పెద్ద పులి దాడి చేసి ఆవులను చంపడం కలకలం రేపింది. గుర్వుపూర్ అటవీ ప్రాంతంలో గడ్డి పెంపకాన్ని చేపట్టి ప్రత్యేకంగా ప్లాంటేషన్ ఏర్పాటు చేశారు. నీటి సౌకర్యం నిండుగా ఉండేందుకు చెక్ డ్యాంలు నిర్మించారు. నివాసానికి అనుకూల ప్రాంతంగా మార్చడంతో పులి తిరిగి ఈ ప్రాంతంలో సంచరిస్తోంది. వేటగాళ్ళలో పులికి ఇబ్బంది లేకుండా అటవీ అధికారుల దృష్టి సారించారు.