- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టికెట్స్ రేట్లు పెంచలేదు : TGSRTC ఎండీ సజ్జనార్
దిశ, వెబ్ డెస్క్ : బతుకమ్మ, దసరా నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ బస్సు సర్వీసుల్లో విపరీతంగా టికెట్ల ధరలు పెంచారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ టికెట్స్ రేట్లు పెంచడం అవాస్తవం అంటూ వివరణ ఇచ్చారు. 2003లో వచ్చిన జీవో 16 ప్రకారమే స్పెషల్ బస్సుల్లో మాత్రమే చార్జీలను సవరించామని పేర్కొన్నారు. రెగ్యులర్ సర్వీసుల టికెట్స్ లో ఎలాంటి పెంపు లేదని వెల్లడించారు. పండగ సమయాల్లో స్పెషల్ బస్సుల డీజీల్ ఖర్చుల మేరకు రేట్లు సవరించుకోవచ్చని, ఆ మేరకు కేవలం స్పెషల్ బస్సుల్లో మాత్రమే ఈ పెంపు ఉందని అన్నారు. 8500 రెగ్యులర్ సర్వీసుల్లోని టికెట్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవని, కేవలం దసరా పండగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని నడిపే 500 సర్వీసుల్లో మాత్రమే చార్జీల పెంపు ఉందని ప్రయాణికులు గమనించాలని కోరారు. కొందరు కావాలనే సంస్థపై దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ఆర్టీసీ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.