- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.. భద్రత పెంచండి : రఘునందన్ రావు
దిశ, డైనమిక్ బ్యూరో: తనకు కల్పిస్తున్న పోలీసు భద్రతను రెట్టింపు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కోరారు. కొంతమంది నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు డీజీపీ కార్యాలయంలో రఘునందన్‌రావు లేఖ అందజేశారు. భద్రత పెంపుకు సంబంధించిన గతంలోనే తాను ప్రభుత్వానికి దరఖాస్తు చేశానని.. కానీ ఇప్పటివరకూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పోలీసులకు 11,200 వేల వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేసినా ప్రజల భద్రత లేదని రఘునందన్ రావు మండిపడ్డారు.
‘అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని పోలీసు వాహనాలున్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత కొన్న వెహికల్స్ ఏడున్నాయి. ఎవరిదగ్గరనున్నాయి. దానిపై ప్రతి నెలా పెడుతున్న ఖర్చు ఎంత. ఇంత ఖర్చు పెడుతున్నా జూబ్లీహిల్స్ లాంటి ప్రదేశాల్లో రేప్‌లు ఎలా అవతున్నాయి. బంజారాహిల్స్ ప్రాంతంలో చాలా నేరాలు ఎలా జరగుతున్నాయి. దీనికి సంబంధించి కొన్న వాహనాలు ఎన్ని, పెడుతున్న ఖర్చెంత, సీసీ కెమెరాలు ఎన్ని ఉన్నాయనే వాటిపై సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరుతున్నాం. ఈ సమాచారం ఇచ్చేందుకు కావాల్సినంత డబ్బుల్ని ఆర్టీఐ కింద ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నాం. అందుకు సంబంధించిన పత్రాలన్నింటినీ మార్క్ చేసి, సంబంధిత అధికారులకు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారికీ అందించాం. రెండు, మూడు రోజుల్లో తమకు అందిస్తామని డీజీపీ కార్యాలయం తెలిపింది.’’ అని రఘునందన్ రావు పేర్కొన్నారు.