- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మార్ఫింగ్ వీడియో చేసిన వాళ్ళని వదిలిపెట్టం: ప్రధాని మోడీ
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలు బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందనే వీడియోను మార్ఫింగ్ చేసి అప్ లోడ్ చేసింది. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది.. మార్ఫింగ్ వీడియోను రిలీజ్ చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు.. పలువురికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ సీరియస్ అయ్యారు. ఈ రోజు సంగారెడ్డి జిల్లాలో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు. ఇక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో పై మోడీ స్పందించారు.
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లును బీజేపీ తీసేస్తుందని మార్ఫింగ్ వీడియో విడుదల చేసి ప్రజల్లో ఆందోళన కలిగించాలని కాంగ్రెస్ చూస్తోందని ప్రధాని విమర్శలు చేశారు. ఫేక్ వీడియోలను విడుదల చేసిన వాళ్లను వదిలే ప్రసక్తే లేదని.. ప్రధాని మోడీ కాంగ్రెస్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావని తేలిందని.. ఈ కారణంగానే ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రిజర్వేషన్లపై మార్ఫింగ్ వీడియోలు, రాజ్యాంగంలో మార్పులు వంటి విషయాల్లో తప్పదోవ పట్టించాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుందని ప్రధాని మోడీ తెలిపారు.
Read More...
కాంగ్రెస్ భారత రాజ్యాంగాన్ని తమ రాజకీయాలకే వాడుకుంటుంది: ప్రధాని మోడీ