- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజాపాలన దినోత్సవం అందుకే నిర్వహిస్తున్నాం..సీఎం ఆసక్తికర పోస్ట్
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజాపాలన దినోత్సవం వేడుకలను ప్రారంభించిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. ‘ఇది నాలుగు కోట్ల ప్రజల పిడికిలి.. ఇది ఎప్పటికీ అలాగే ఉండాలి. మా ఆలోచన, మా ఆచరణ ప్రతీది ప్రజా కోణమే. అందుకే ఈ శుభ దినాన్ని ‘ప్రజాపాలన దినోత్సవం’గా అధికారికంగా నిర్వహిస్తున్నాం’ అని తెలిపారు. ప్రాణత్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పాలన పారదర్శకంగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి.. ప్రతి నిర్ణయంలో ప్రజల కోణం ఉండాలి.. అని పేర్కొన్నారు.
అమరుల ఆశయాలు, యువత ఆకాంక్షలు ఉండాలన్నారు. పదేళ్లలో విధ్వంసమైన తెలంగాణను సాంస్కృతికంగా, ఆర్థికంగా పునరుజ్జీవం చేయాల్సిన అవసరాన్ని మేము గుర్తించామన్నారు. మేము బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి ఆ దిశగానే అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. కాగా, నూతన తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం రాష్ట్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తున్నది. ఈ దినోత్సవాన్ని విలీనం, విమోచనం, విద్రోహం, సమైక్యతా దినోత్సవం లాంటి వివిధ పేర్లతో పార్టీలు, ప్రభుత్వాలు ఈ వేడుకలను పోటాపోటీగా జరుపుతున్నాయి.
- Tags
- revanth reddy