KTR : వ్యవసాయాన్ని పండుగ చేయడమంటే ఇదీ! : కేటీఆర్

by Y. Venkata Narasimha Reddy |
KTR : వ్యవసాయాన్ని పండుగ చేయడమంటే ఇదీ! : కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్(KCR) తొమ్మిదున్నర ఏండ్ల కాలంలో తెలంగాణ సాధించిన అద్భుతాలలో 2013-14 నుంచి 2022-23మధ్య కాలంలో వ్యవసాయం,సాగునీటి రంగాల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాధించిన ఘనతకు ఆర్బీఐ(RBI) తాజా గణాంకాలే నిదర్శనమని.. వ్యవసాయాన్ని పండుగ చేయడమంటే ఇదీ! అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఎక్స్ వేదికగా వెల్లడించారు. 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా....మిషన్ కాకతీయ ..కాళేశ్వరం..రైతుబంధు సహాఅనేక వ్యవసాయ అనుకూల విధానాల ఫలితాలతో సాగును సంబురం చేశామని కేటీఆర్ పేర్కొన్నారు.

తెలంగాణలో సాగునీటి సదుపాయం(రెండు పంటలు)తో 2013-14 – 78 లక్షల 18 వేల ఎకరాలు, 2022-23 సంవత్సరంలో కోటీ 60 లక్షల ఎకరాలని, తెలంగాణలో పంటల సాగు (రెండు పంటలు) 2013-14 లో కోటీ 55 లక్షల ఎకరాలు కాగా, 2022-23లో 2 కోట్ల 29 లక్షల ఎకరాలని కేటీఆర్ పేర్కొన్నారు. ఆహార పంటల ఉత్పత్తి 2013-14లో 2 కోట్ల 25లక్షల టన్నులు కాగా, 2023-24లో 5 కోట్ల టన్నులని ఆర్బీఐ గణంకాలను ఉదహరించారు. ఇవి దాచేస్తే దాగని సత్యాలు ఇవి! చెరిపేస్తే చెరగని కేసీఆర్ ఆనవాళ్లు ఇవి! అని కేటీఆర్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed