గద్దర్ చనిపోయేముందు చెప్పింది ఇదే.. కోదండరామ్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Ramesh N |
గద్దర్ చనిపోయేముందు చెప్పింది ఇదే.. కోదండరామ్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ చేస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరామ్ ఎమ్మెల్సీ పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీగా ప్రభుత్వం ఎంపిక చేసింది అంటే తెలంగాణ జన సమితి నాయకులు చేసిన సేవా మాత్రమేనని అన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఇవాళ పార్టీ స్టేట్ ఆఫీస్‌లో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎలా పని చేశామో అదేవిధంగా రేపు కూడా పని చేస్తామన్నారు. తెలంగాణలో ఆశించిన మార్పుల కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పదవులు తమ సొంతానికి ఉపయోగించడానికి కాదని తెలిపారు.

రాజ్యాంగ విలువలు గురించి ఆయన మాట్లాడారు. అయితే రాజ్యాంగం పనికి రాదు అని కొందరు అంటున్నారని, కొత్త రాజ్యాంగం రాసుకోవలని చూసున్నారని, కేసీఆర్ కూడా రాజ్యాంగం మార్చాలని అన్నారని గుర్తుచేశారు. చైనా, సింగపూర్ లలో ఉన్న నియంతృత్వ పాలన ఉండాలని చూస్తున్నారని తెలిపారు. సమాజ మార్పు దానంతట అదే జరుగుతుంది అనుకుంటే జరగదన్నారు. ప్రజా యుద్ధనౌక గద్దర్ చనిపోయే ముందు రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు ఆచరణలోకి వస్తేనే పూర్తి సమానత్వం వచ్చినట్లు అన్నారని గద్దర్ మాటలను కోదండరామ్ గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం అంతా రాజ్యాంగ విలువల ప్రకారం జరిగిందన్నారు.

Advertisement

Next Story

Most Viewed