‘భజన’.. బడ్జెట్‌పై BRS ఎంపీల రియాక్షన్ ఇదే..!

by Sathputhe Rajesh |   ( Updated:2024-02-01 16:00:41.0  )
‘భజన’.. బడ్జెట్‌పై BRS ఎంపీల రియాక్షన్ ఇదే..!
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్ సభ ఎన్నికలకు ముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంట్‌లో తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ అంశంపై బీఆర్ఎస్ ఎంపీలు ఘాటుగా స్పందించారు. కేంద్ర బడ్జెట్ పూర్తి నిరాశ, నిస్పృహలతో ఉందన్నారు. బడ్జెట్ ప్రసంగం బీజేపీ సొంత భజనలా ఉందని సెటైర్లు వేశారు. బడ్జెట్‌లో ఒక్క కొత్త సంక్షేమ పథకం ప్రస్తావన లేదన్నారు. సామాన్యులకు, ఉద్యోగులకు ఎలాంటి ఊరట లేదని.. పీఎం కిసాన్ సాయం పెంచుతారని రైతులు ఆశించారన్నారు. ఆయుష్మాన్ పథకం పరిమితి రూ.10లక్షలకు పెంచుతామని ఆశించారని తెలిపారు. ఎప్పటిలాగే తెలంగాణకు మొండి చేయి చూపారన్నారు. విభజన హామీల అమలు, నిధుల ప్రస్తావన ఎక్కడా లేదని ఫైర్ అయ్యారు.

Read More..

ఆటోకు నిప్పంటించిన డ్రైవర్.. ప్రజాభవన్ వద్ద హైటెన్షన్

Advertisement

Next Story

Most Viewed