గర్వంగా ఉంది.. బడ్జెట్‌పై డీకే అరుణ రియాక్షన్ ఇదే!

by GSrikanth |   ( Updated:2023-02-01 08:29:36.0  )
గర్వంగా ఉంది.. బడ్జెట్‌పై డీకే అరుణ రియాక్షన్ ఇదే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బడుగు బలహీనవర్గాలకు ఊతమిచ్చి, దేశ ప్రగతికి దోహద పడేలా ఉందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. రైతు రుణాలకు రూ.20 లక్షల కోట్లు కేటాయించడంతో పాటు 'శ్రీ అన్న' పథకం ద్వారా చిరు ధాన్యాలు పండించే రైతులకు ప్రోత్సాహం అందించి దేశాన్ని హరిత అభివృద్ధి వైపు నడిపించే నిర్ణయం తీసుకున్నారని, ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆమె ధన్యవాదాలు తెలిపారు. నవ భారత నిర్మాణం దిశగా భారతదేశాన్ని నడిపించడానికి, దేశవ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనను ఈ బడ్జెట్ వేగవంతం చేస్తుందని డీకే అరుణ ఒక ప్రకటనలో వెల్లడించారు. పేదల ఇండ్ల నిర్మాణం కోసం అత్యంత ప్రాధాన్యతనిస్తూ, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద రూ.79 వేల కోట్లు కేటాయించడం గర్వకారణంగా చెప్పుకొచ్చారు. దేశ వ్యాప్తంగా 63 వేల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను డిజిటలైజ్ చేయడం కోసం బడ్జెట్ లో నిధులు కేటాయించడం రైతాంగానికి మేలు చేసే చర్య అని డీకే అరుణ తెలిపారు.

Also Read...

Budget 2023 Live Updates: బడ్జెట్‌లో రైతులకు సూపర్ న్యూస్

Advertisement

Next Story

Most Viewed