దగా ప్రభుత్వానికి - ప్రజా ప్రభుత్వానికి తేడా ఇదే : కాంగ్రెస్ ఆసక్తికర ట్వీట్

by Ramesh N |
దగా ప్రభుత్వానికి - ప్రజా ప్రభుత్వానికి తేడా ఇదే : కాంగ్రెస్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ (ట్విట్టర్) వేదిక బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. యువతకు చదువు అక్కర్లేదు, మత్తుకు బానిసలను చేసి, 4,500 స్కూళ్లు మూసేసి, డీఎస్సీని మటుమాయం చేసి.. బర్లు, గొర్లు కాసుకుని బతకాలి, ఆయన మనవడు మాత్రం ఉన్నత చదువులు చదవాలి.. ఇది కేసీఆర్ ఆలోచన అని టీ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.

కాంగ్రెస్ పాలనలో యువతను మత్తులో చిత్తు కాకుండా కాపాడాలి, డ్రగ్స్, గంజాయి పై ఉక్కు పాదం మోపాలి, వారికి నాణ్యమైన విద్య ఇవ్వాలి, 11 వేల పై చిలుకు టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సీ నిర్వహించాలి, ప్రతి నియోజకవర్గంలో ఒకే ఆవరణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లు ఏర్పాటు చేయాలి, రాష్ట్రంలో శిథిలావస్థకు చేరిన 65 ఐటీఐలను స్కిల్ సెంటర్లుగా మార్చాలి, మన బిడ్డల నైపుణ్యాలను పెంచేందుకు సరికొత్త ఆలోచనగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి.. అని పేర్కొంది. ఇది దగా ప్రభుత్వానికి - ప్రజా ప్రభుత్వానికి తేడా అని ట్వీట్ చేసింది.

Advertisement

Next Story