రీల్ కోసం డేంజర్ స్టంట్! ఇది ఫేక్ వీడియో.. సజ్జనార్ ఆసక్తికర ట్వీట్

by Ramesh N |
రీల్ కోసం డేంజర్ స్టంట్! ఇది ఫేక్ వీడియో.. సజ్జనార్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడం కోసం యువత ఈ మధ్య వికృత చేష్టాలతో ఇన్‌స్టా రీల్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ ప్రధాన రహదారి వద్ద నడుస్తున్న బస్సు ముందు అకస్మాత్తుగా పడుకున్న యువకుడు అంటూ సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు కొడుతోంది. దీనిపై టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న ఈ వీడియో ఫేక్‌ అని సజ్జనార్ తాజాగా ట్వీట్ చేశారు. ఇది పూర్తిగా ఎడిటెడ్ వీడియో అని, సోషల్‌ మీడియాలో పాపులర్‌ కోసం కొందరు ఇలా వీడియోలను ఎడిట్‌ చేసి వదులుతున్నారని వెల్లడించారు.

ఇలాంటి వెకిలి చేష్టలతో ఆర్టీసీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేయడం మంచి పద్ధతి కాదని సూచించారు. లైక్‌ లు, కామెంట్ల కోసం చేసే ఈ తరహా అనాలోచిత పనులను ఇతరులు అనుకరించే ప్రమాదం పొంచి ఉందని, సరదా కోసం చేసే ఎడిటెడ్‌ వీడియోలు ఇతరులకు ప్రాణాపాయం కూడా కలిగిస్తాయన్నారు. ఇలాంటి ఘటనలను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం సీరియస్‌గా తీసుకుంటోందని, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

Advertisement

Next Story