శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో దట్టమైన పొగలు.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు

by Shiva |
శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో దట్టమైన పొగలు.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇటీవల వరుస రైలు ప్రమాదాలను మరువక ముందే తాజాగా మహబూబాబాద్ జిల్లా గుండ్రాతిమడుగు రైల్వే స్టేషన్ సమీపంలో సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా పొగలు చెలరేగాయి. దీంతో అప్రపమత్తమైన తమ లజేజీలతో సహా ప్రయాణికులు ట్రైన్ నుంచి దూకి పరుగులు తీశారు. ఏ భోగిలో మంటలు అంటుకున్నాయో తెలియక భయంతో వణికిపోయారు. ప్రయాణికుల సమాచారం మేరకు లోకో పైలెట్ పొగలు వచ్చిన ప్రాంతాన్ని పరిశీలించగా.. బ్రేక్ లైనర్లు పట్టేయడంతోనే పొగలు వచ్చాయని గ్రహించాడు. ఈ హఠాత్పరిణామంతో ట్రైన్ గుండ్రాతిమడుగు సమీపంలో 15 నిమిషాలు పాటు నిలిచిపోయింది. రైల్వే ఫిట్టర్లు వచ్చి బ్రేక్ లైనర్లు సరిచేయటంతో ట్రైన్ అక్కడి నుంచి విజయవాడ వైపు పరుగులు తీసింది.

Advertisement

Next Story

Most Viewed