- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ముందుగా ఆఫర్లంటారు.. ఆ తర్వాత ఉన్నదంతా ఊడ్చేస్తారు!

దిశ, వెబ్ డెస్క్: బెట్టింగ్ యాప్స్.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో వీటి ఊబిలో చిక్కుకుని అప్పుల పాలై పలువురు ఆత్మహత్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు బెట్టింగ్స్ యాప్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నాయి. ఈ క్రమంలోనే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది యూట్యూబర్లపై కేసులు కూడా నమోదు చేసింది. అంతేకాదు, బెట్టింగ్ యాప్స్ పై విరుచుకుపడుతూ.. సోషల్ మీడియాలో వరస పోస్టులు పెడుతూ ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ పోలీసులు మరో ట్వీట్ చేశారు. 'రమ్మీ సర్కిల్, ఆన్ లైన్ కార్డ్స్ గేమ్ యాప్స్ మీ కుటుంబాలను కబళిస్తాయి. ముందుగా ఆ ఆటలోకి ప్రవేశించగానే ఆఫర్లంటూ ఊరించి డబ్బులు వచ్చేలా వలవేస్తారు. తర్వాత అదే ఆశను ఆసరాగా చేసుకుని మీ డబ్బులను లూటీ చేస్తారు. ఇలాంటి కార్డ్స్ గేమ్ లకు దూరంగా ఉండండి. మీ జీవితాలను నాశనం చేసుకోకండి' అంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు.
రమ్మీ సర్కిల్, ఆన్ లైన్ కార్డ్స్ గేమ్ యాప్స్ మీ కుటుంబాలను కబళిస్తాయి. ముందుగా ఆ ఆటలోకి ప్రవేశించగానే ఆఫర్లంటూ ఊరించి డబ్బులు వచ్చేలా వలవేస్తారు. తర్వాత అదే ఆశను ఆసరాగా చేసుకుని మీ డబ్బులను లూటీ చేస్తారు. ఇలాంటి కార్డ్స్ గేమ్ లకు దూరంగా ఉండండి. మీ జీవితాలను నాశనం చేసుకోకండి. pic.twitter.com/whqmzSuDj0
— Telangana Police (@TelanganaCOPs) March 18, 2025