- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఇటలీలో ఎల్లారెడ్డిపేటవాసి దుర్మరణం

దిశ, ఎల్లారెడ్దిపేట : ఉపాధి నిమిత్తం పొట్ట చేత పట్టుకొని విదేశాలకు వెళ్లిన వ్యక్తిని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. ఎల్లారెడ్దిపేటకు చెందిన మహమ్మద్ సమద్ కుటుంబంతో సహా గత ఇరవై సంవత్సరాల క్రితం ఎల్లారెడ్దిపేట నుండి సిద్దిపేటకు బతుకుదెరువు నిమిత్తం వెళ్లాడు. సమద్ కు ముగ్గురు కుమారులు రషీద్, రఫిక్, సద్దాం, కూతురు జరీనా ఉన్నారు. సమద్ సంతానంలో పెద్ద కుమారుడు రషీద్ కంపెనీ వీసాపై గత కొద్ది రోజుల క్రితం ఇటలీ దేశానికి ట్రక్కు నడపడానికి వెళ్లాడు.
డ్యూటీ రీత్యా ఇటలీ నుండి జపాన్, జర్మనీ దేశాలకు ట్రాన్స్ పోర్ట్ డ్యూటీ చేస్తున్నాడు. అక్కడ తన మిత్రుడితో కలిసి రోడ్డు దాటుతుండగా రోడ్డు ప్రమాదం జరిగి అక్కడికక్కడే చనిపోయాడు. మృతదేహం బుధవారం స్వదేశానికి రానున్నట్లు తెలిసింది. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆడుకోవాలని మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్ది, మాజీ ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్, మాజీ వార్డు సభ్యురాలు ఒగ్గు లక్ష్మి, బీజేపీ నాయకులు నేవూరి శ్రీనివాస్ రెడ్ది, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.