- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
OTT: ఓటీటీలోకి డ్రాగన్.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేసిన ప్లాట్ ఫామ్

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan), యంగ్ హీరోయిన్స్ కయ్యదు లోహర్ (Kaiyyadu Lohar), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘డ్రాగన్’ (Dragon). ‘ఓ మై కడవులే’ ఫేమ్ అశ్వత్ మరిముత్తు (Ashwath Marimuthu) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై కల్పాతి ఎస్. అఘోరమ్, కల్పాతి ఎస్. గణేష్, కల్పాతి ఎస్. సురేష్ నిర్మించారు. మొదట కోలీవుడ్‌లో రిలీజైన ఈ చిత్రం అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది.
తర్వాత తెలుగులో రిలీజై ఇక్కడ కూడా మంచి సక్సెస్ అందుకుంది. అలాంటి ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌కు సిద్ధం అయింది. ‘డ్రాగన్’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) సొంతం చేసుకోగా.. ఈ నెల 21 నుంచి తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చెయ్యగా.. అందులో ప్రదీప్ కొన్ని బుక్స్ కుప్పగా ఉండగా వాటిపై కూర్చుని విచిత్రంగా చూస్తున్నాడు. ప్రజెంట్ ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.
Read More..
OTT: ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ హిట్ సిరీస్ రాబోతుంది.. థ్రిల్ అవ్వడానికి మీరు సిద్ధమేనా?