- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Janhvi Kapoor's boyfriend : కులోన్మాదికి ఇచ్చి పడేసిన జాన్వీ బాయ్ ఫ్రెండ్.. పోస్టు వైరల్!

దిశ, వెబ్‌డెస్క్: Janhvi Kapoor's boyfriend Shikhar Pahariya: బాలీవుడ్ అందాల శ్రీదేవి కూతురు జాన్వీకపూర్(Janhvi Kapoor) కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆమె సినిమాలే కాదు వ్యక్తిగత జీవితం గురించి చాలా వార్తలు వైరల్ అవుతుంటాయి. జాన్వీ కపూర్ శిఖర్ పహారియా(Shikhar Pahariya)తో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. కానీ ఈ విషయంపై జాన్వీ(Janhvi Kapoor) అధికారికంగా ప్రకటించలేదు. వీరిద్దరు మాత్రం చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు శిఖర్ పహారియా (Shikhar Pahariya).
తన కులం గురించి ప్రస్తావిస్తూ దళితుడిని అంటూ ఓ వ్యక్తి ప్రసావించడంపై అతను ఫైర్ అయ్యాడు. ఈ కాలంలో అంటరానిది ఏమైనా ఉందంటే అది నీ ఆలోచన మాత్రమే అంటూ కామెంట్ చేశాడు. గతేడాది దీపావళి నాడు శిఖర్ , జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తమ పెంపుడు కుక్కలతో క లిసి ఉన్న కొన్ని ఫొటోలను తన ఇన్ స్టా అకౌంట్ ఫీడ్ లో పోస్ట్ చేశాడు శిఖర్. ఇటీవల ఓ వ్యక్తి ఆ పోస్టు కింద నువ్వు దళితుడివి కదా అని కామెంట్ చేశాడు. దానికి శిఖర్ తన ఇన్ స్టా స్టోరీస్ లో ఆ కామెంట్ పోస్టు చేస్తూ 2025లో కూడా నీలాంటి చిన్న, వెనకబడిన ఆలోచనలు ఉన్నవాళ్లు ఉండటం నిజంగా సిగ్గు చేటు అని కామెంట్ రాశాడు.
భారతదేశం బలం దాని భిన్నత్వం, కలుపుగోలుతనంలో ఉందని కూడా చెప్పాడు. దీపావళి అనేది వెలుగు, అభివ్రుద్ధి, ఐక్యత పండగ. ఈ భావనలు నీ పరిమిత బుద్ధికి అందవు.నీకు అర్ధం కాదు. అజ్నానాన్ని వ్యాప్తి చేయడం మానేసి నిన్ను నువ్వు కాస్త ఎదిగేలా చూసుకో. ఎందుకంటే ఇక్కడ నిజంగా అంటరానిది నీ ఆలోచనా విధానం మాత్రమే అని అన్నాడు.
గత ఏడాది నవంబర్ లో శిఖర్ అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఫొటోలు పోస్టు చేశారు. శ్రీరాముని రాక వెలుగు శ్రేయస్సుతో కూడిన ఏడాది తీసుకురావాలి. చెడుపై మంచి విజయం సాధించాలి. మనకు అవసరమైన వారికి సహాయం అందించడానికి పైకి తీసుకురావడానికి రక్షించడానికి ఎల్లప్పుడూ ధర్మ మార్గాన్ని ఎంచుకునే బలం జ్నానం ఉండాలి అంటూ రాసుకొచ్చాడు.
Read More..
‘అవి సులభం అయినప్పుడు మనం పనులు చేయడం మానేస్తాం’: Malavika Mohan