సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఎమ్‌ఎస్ ధోని.. షూటింగ్ వీడియో వైరల్

by Mahesh |   ( Updated:2025-03-18 13:08:00.0  )
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఎమ్‌ఎస్ ధోని.. షూటింగ్ వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: భారత మాజీ కెప్టెన్ ఎమ్ఎస్ ధోని (MS Dhoni), సినిమా ఇండస్ట్రీలో సంచలన డైరెక్టర్ అయిన సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో నటించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral on social media) గా మారింది. ఆ వీడియోలో ఎమ్ ఎస్ ధోని యానిమల్ సినిమాలో హీరో క్యారెక్టర్ లో కనిపించడంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు వీరిద్దరూ కలిసి పనిచేయడం ఎంటనే తెగ చర్చించుకున్నారు. కాగా ఆ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అతి త్వరలో ఐపీఎల్ మెగా టోర్నీ (IPL mega tournament) ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ సమయంలో భారత క్రికెటర్లకు సంబంధించిన యాడ్లకు భారీ డిమాండ్ ఉంటుంది.

దీంతో ఓ ఎలక్ట్రిక్ సైకిల్ కంపెనీ.. ఎమ్ఎస్ ధోని (MS Dhoni), డైరెకర్టర్ సందీప్ రెడ్డి (Director Sandeep Reddy)తో యాడ్ చేయింది. దీనికి సంబంధించిన ప్రోమోలే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వీడియోలో యానిమల్ సినిమాలో హీరో క్యారెక్టర్ రోల్‌లో ధోని ఎలక్ట్రికల్ సైకిల్ పై రావడాన్ని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా షూట్ చేయడం చూడవచ్చు. కాగా ఈ యాడ్ కు సంబంధించిన ఫుల్ వీడియోను త్వరలో విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే ఎమ్ ఎస్ ధోని ఈ ఐపీఎల్ సీజన్ (IPL season) లో చెన్నై జట్టు తరఫున,, యువ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో ఆడనున్నాడు.

Next Story

Most Viewed