- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అక్రమ డంపులు ఒకచోట.. తనిఖీలు మరోచోట..

దిశ, మక్తల్ : నియోజకవర్గంలోని పెద్దవాగు నుంచి అధికార పార్టీ నాయకులు పేరు చెప్పి ఇసుక రీచ్ దగ్గర డంపింగ్ చేసిన ఇసుకను అర్ధరాత్రి ఏడు టిప్పర్లతో అక్రమ ఇసుక రవాణా చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు తనిఖీ కొస్తే ఎమ్మెల్యే పేరు చెప్పడంతో వెను తిరిగి పోయింది. పెద్దవాగు కృష్ణానది పనివాక ప్రాంతం నుండి అర్ధరాత్రి అక్రమ ఇసుక తరలుతుందని"దిశ "లో కథనం రావడంతో మైనింగ్ అధికారులు స్పందించి సోమవారం అక్రమ ఇసుక డంపింగులు. రవాణా స్థలాలను తనిఖీ చేయకుండా అధికారికంగా ప్రకటించిన రీచుల దగ్గర తనిఖీలు చేసి వెళ్లారు. ఇసుక రీచుల నుండి ఎగువన డంపింగ్ చేసిన ఇసుకను మంగళవారం మసక రాత్రి ఏడు టిప్పర్ల ద్వారా తరలిస్తుండగా తెలిసిన పోలీసులు టిప్పర్లను ఆపగా ఇసుక మాఫియా వారు ఇది ఎమ్మెల్యే చెప్పడంతో ఇసుకను తరలిస్తున్నామని చేప్పడంతో నిజమేంత అని రూడి చేసుకోకుండా పోలీసులు టిప్పర్లను వదిలేశారు.
సోమవారం మధ్య రాత్రి మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ సమీపం దగ్గర్లో ఉన్న ఇసుక రీచ్ నుంచి ఉదయం ఎగువ ప్రాంతాన ఇసుకను డంపింగ్ చేయగా అర్ధరాత్రి అధికార పార్టీ నాయకుని పేరు చెప్పి ఏడు టిప్పర్లతో ఇసుక రవాణా కొనసాగించారు. సామాన్యులు సొంత ఇల్లు కట్టుకోవడానికి ఇసుకను తరలిస్తుంటే పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారు. రాత్రి సమయంలో మాగనూరు సమీపంలో గల పెద్ద వాగు నుంచి ఏకంగా టిప్పర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్న వారి పై పోలీసులు రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మామూళ్ళ మత్తులో పోలీసు రెవెన్యూ అధికారులు ఇసుక మాఫియా అక్రమార్కులకు వంత పాడుతున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ ప్రతినిధులైనంత మాత్రాన అర్ధరాత్రి ఇసుక తరలిస్తుంటే పోలీసులు, మైనింగ్, రెవెన్యూ అధికారులు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.