- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
యూపీఎస్సీ అధికారులపై కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో : యూపీఎస్సీ(యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్) అధికారులపై బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి బిశ్వేశ్వర్ తుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూపీఎస్సీ ద్వారా నియమితులైన అధికారులు డకాయిట్స్(దోపిడి దొంగలు) అంటూ తుడు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కోడి దొంగను అయినా శిక్షించవచ్చు కానీ, మినరల్ మాఫియా వారిని శిక్షించే వ్యవస్థ కాదంటూ విమర్శలు గుప్పించారు. శనివారం బాలాసోర్ జిల్లాలోని బలియాపాల్‌లోని ప్రభుత్వ పాఠశాల స్వర్ణోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా బిశ్వేశ్వర్ తుడా ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
‘యుపీఎస్సీ ద్వారా నియమితులైన అధికారులు చాలా పరిజ్ఞానం ఉన్న వ్యక్తులు. ఎల్లప్పుడూ ఉన్నత స్థానాల్లో ఉంటారని నాకు ఒక ఆలోచన ఉండేది. కానీ ఇప్పుడు అక్కడ నుండి అర్హత సాధించిన వారిలో చాలా మంది దొంగలు ఉన్నారని నేను భావిస్తున్నాను. నేను 100 శాతం చెప్పను. కానీ వారిలో చాలామంది దోపిడి దొంగలు ఉన్నారు’ అని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా, యూపీఎస్సీ దేశంలోని ప్రధాన కేంద్ర నియామక సంస్థ అని, ఇది ప్రభుత్వ ఉన్నత అధికారులను నియమిస్తుందని కేంద్రమంత్రి అన్నారు. మొదట దాని పట్ల తనకు ఎంతో గౌరవం ఉండేదని, కానీ ఇప్పుడు అది మారిపోయిందన్నారు. ‘అలాంటి విద్యావంతులు ఉంటే మన సమాజం ఎందుకు అవినీతి, అన్యాయంలో మునిగిపోయింది?’ అని కూడా ఆయన ప్రశ్నించారు.