బీఆర్ఎస్‌ను వీడిన సిట్టింగ్ ఎంపీలు వీరే.. కన్ఫూజన్‌లో క్యాడర్!

by Ramesh N |
బీఆర్ఎస్‌ను వీడిన సిట్టింగ్ ఎంపీలు వీరే.. కన్ఫూజన్‌లో క్యాడర్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల ముందు తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిమాణాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఎవరు ఊహించని తీరులో బీఆర్ఎస్ పార్టీని ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు ఇతర పార్టీల్లోకి జంప్ అయ్యారు. తెలంగాణలో 2019 లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలుపొందిన ఐదుగురు ఎంపీలు ఆ పార్టీని వీడారు. మొదటగా జహీరాబాద్, నాగర్ కర్నూలు ఎంపీలు బీబీ పాటిల్, రాములు బీజేపీలో చేరారు. పెద్దపల్లి, వరంగల్ ఎంపీలు వెంకటేశ్ నేత, పసునూరి దయాకర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా బీఆర్ఎస్ కీలక నేత, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్‌కు ప్రస్తుతం నలుగురు ఎంపీలు మాత్రమే ఉన్నారు.

కన్ఫూజన్‌లో క్యాడర్!

బీఆర్ఎస్ నేత ఖైరతాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నగేందర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరోవైపు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే వార్తలు వస్తున్నాయి. ఇదివరకే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు సైతం పార్టీలు మారిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ నేతలు బొంతు రామ్మోహన్, తాటికొండ రాజయ్య, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, పట్నం సునీతా రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, తీగల అనితారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ ఎంపీ జి.నగేశ్, మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కీలక నేతలు పార్టీలు మారడంతో క్యాడర్ మొత్తం కన్ఫూజన్‌లో పడింది. అటు మాజీ సీఎం కేసీఆర్ ఇటు సొంత నేతలు ఎవరికి సపోర్ట్ చేయాలనే గందరగోళంలో శ్రేణులు ఉన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్‌లో అరెస్టుతో కావడం, నేతల వలసలు పెరగడంతో పార్లమెంట్ ఎన్నికల వేల అధిష్టానానికి తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed