Mulugu encounter : ములుగు ఎన్ కౌంటర్ మృతులు వీరే !

by Y. Venkata Narasimha Reddy |
Mulugu encounter : ములుగు ఎన్ కౌంటర్ మృతులు వీరే !
X

దిశ, వెబ్ డెస్క్ : ములుగు జిల్లా ఏటూరునాగారంలో జరిగిన ఎన్ కౌంటర్(Mulugu encounter)లో హతమైన ఏడుగురు మావోయిస్టుల(Seven Maoists Identification) వివరాలను పోలీసులు గుర్తించారు. పోలీసుల చెబుతున్న వివరాల మేరకు మృతుల్లో మావోయిస్టు కీలక నేత బద్రు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. చనిపోయిన వారిలో టీఎస్ సీఎం సెక్రటరీ(యెల్లందు-నర్సంపేట) కుర్సం మంగు భద్రు అలియాస్ పాపన్న, ఏటూరునాగారం మహదేవ్‌పూర్ డీవీసీఎం కార్యదర్శి ఈగోలపు మల్లయ్య అలియాస్ మధు, ఏసీఎం ముస్సాకి దేవల్ అలియాస్ కరుణాకర్, ఏసీఎం ముస్సాకి జమున, పార్టీ సభ్యులు జైసింగ్, కిషోర్, కామేష్ లు ఉన్నట్లుగా తెలిపారు.

చల్పాక అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో భద్రు, మధుల నుంచి రెండు ఏకే 47తుపాకులతో పాటుగా భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed