- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bandi Sanjay : ఇవి విజయోత్సవాలు కాదు వికృత ఉత్సవాలు: బండి సంజయ్
దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government)ఏడాది పాలన విజయోత్సవాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఇవి ప్రజాపాలన విజయోత్సవాలు(victory celebrations)కావని వికృత ఉత్సవాలు అంటూ మండిపడ్డారు. ఏడాది అరాచక పాలనే కాంగ్రెస్ విజయమా? ప్రజల చావులు, గోసలే ఉత్సవమా? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ దృష్టిలో పిల్లలకు పురుగులన్నం పెట్టడం విజయమని.. వారి చావులు ఉత్సవమని, యువతకు ఉద్యోగాలివ్వకపోవడం విజయమని, వారికి సంకెళ్లేయడం ఉత్సవమని దుయ్యబట్టారు.
రైతులను మోసం చేయడం విజయమని.. వారికి ఉరితాళ్లేయడం ఉత్సవమని, ఆడబిడ్డలకు ఆగం చేయడం విజయం..వారి కన్నీళ్లు ఉత్సవం అని విమర్శించారు. ఇండ్లు ఇస్తమని మోసం చేయడం విజయం..ఉన్న ఇండ్లు కూల్చడం ఉత్సవం..రుణమాఫీ చేస్తమని మాట తప్పడం విజయం..అప్పులకు నోటీసులివ్వడం ఉత్సవమని ఫైర్ అయ్యారు.