PONNAM: స్కూళ్లలో ఉపాధ్యాయుల కొరత లేదు: పొన్నం ప్రభాకర్

by Prasad Jukanti |   ( Updated:2024-08-17 08:45:28.0  )
PONNAM: స్కూళ్లలో ఉపాధ్యాయుల కొరత లేదు: పొన్నం ప్రభాకర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా గత నెలలో ఉపాధ్యాయులకు ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయిందని ప్రస్తుతం ఏ స్కూల్ లో కూడా ఉపాధ్యాయుల కొరత లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా రాష్ట్రంలో 1100 కోట్లతో 25 వేల స్కూల్ లకు మౌలిక వసతులు కల్పించడంతో పాటు ప్రతి స్కూల్ కి ఉచిత విద్యుత్, శానిటేషన్ సిబ్బంది స్కావేంజర్స్ కోసం ప్రభుత్వం ప్రతిన నెల నిధులు విడుదల చేస్తున్నదని చెప్పారు. శనివారం హైదరాబాద్ కార్వన్ నియోజకవర్గం కూల్సుంపుర జిల్లా పరిషత్ ప్రాథమికొన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్, అధికారులతో కలిసి మంత్రి ఆకస్మిక పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరుపై ఆరా తీశారు. తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. 10వ తరగతి విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. ఉపాధ్యాయులు సమయ పాలన పాటించాలని మంత్రి ఆదేశించారు. ప్రాథమిక తరగతులను పరిశీలించిన మంత్రి విద్యార్థులతో పాటు కింద కూర్చిండి వారితో ముచ్చటించారు. విద్యార్థులకు ఎల్ఎస్ఆర్ డబ్ల్యూపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా విద్యార్థులు బేసిక్ ఇంగ్లీష్ పై పట్టు సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. నూతనంగా నిర్మిస్తున్న స్కూల్ బిల్డింగ్ ను పరిశీలించి భవన నిర్మాణం ఆలస్యానికి గల కారణాలను ఇంజనీరింగ్ అధికారులను ఆరా తీశారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం అయ్యారు.

Advertisement

Next Story