Singareni : 'సింగరేణి ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతోంది'

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-02 08:53:48.0  )
Singareni : సింగరేణి ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతోంది
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్రం పార్లమెంటులో తీసుకొచ్చిన Mmdr యాక్ట్‌కు బీఆర్ఎస్ ఎంపీలు కూడా మద్దతు పలికారన్నారని ఐఎన్‌టీయూసీ నాయకుడు జనక్ ప్రసాద్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణి ప్రైవేటీకరణ జరిగితే తెలంగాణలో సింగరేణి కనుమరుగవుతుందన్నారు. 22 సంవత్సరాలుగా సింగరేణి కంపెనీ లాభాల్లో ఉన్నాయన్నారు. మోదీ కేసీఆర్‌లు కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఫైర్ అయ్యారు.

బొగ్గును అదాని కంపెనీలో కొనమని కేంద్రం ఆదేశాలు ఇచ్చిందన్నారు. దానివల్ల రాబోయే రోజుల్లో విద్యుత్ రేటు మరింత పెరిగి చిన్న పరిశ్రమలు మూతపడే అవకాశం ఉందన్నారు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్న దాన్ని పరోక్షంగా అమలు చేసే ప్రయత్నం మోడీ చేస్తున్నారన్నారు. కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయానికి కోతలు పెట్టారని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ కంపెనీలకు లాభం చేసేలా ఉందన్నారు. నరేగా పథకానికి భారీగా కోతలు పెట్టారన్నారు. ఈ పథకాన్ని కేంద్రం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. బడ్జెట్ ప్రసంగంలో 43 శాతం నిరుద్యోగుల ప్రస్తావనే లేదని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed