మహాత్మా మన్నించు.. ఇంకోసారి అలా చేయం: క్షమాపణలు కోరిన యువకులు

by srinivas |
మహాత్మా మన్నించు.. ఇంకోసారి అలా చేయం: క్షమాపణలు కోరిన యువకులు
X

దిశ, వెబ్ డెస్క్: మహాత్మా మిన్నించు.. ఇంకోసారి అలా చేయమని గాంధీ విగ్రహం వద్ద హైదరాబాద్ బోయిన్‌పల్లి(Hyderabad Boinpally)కి చెందిన యువకులు వేడుకున్నారు. దీపావళి(Diwali) పండుగ రోజు బోయిన్‌పల్లిలో గాంధీ విగ్రహం(Gandhi Statue) నోట్లో టపాసులు(Crackers) పెట్టి కాల్చారు. అంతేకాదు ఈ దృశ్యాలను రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆకతాయిలు చేసిన పనిపై తీవ్ర విమర్శలు వెల్తువెత్తాయి. స్వాతంత్య్రం కోసం గాంధీ చేసిన పోరాటాన్ని వివరించారు. గాంధీజీని అవమానించిన ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్లు వినిపించాయి.


దీంతో యువకుల తీరులో మార్పు వచ్చింది. స్వచ్చంధంగా ముందుకు వచ్చి క్షమించమని వేడుకుంటూ అదే విగ్రహానికి దండేసి వీడియో రిలీజ్ చేశారు. ‘‘తెలిసీ తెలియక దీపావళి రోజు గాంధీ విగ్రహం వద్ద తప్పు చేశాం. మళ్లీ ఎప్పుడు చేయం. మహాత్మా అంటే మాకు గౌరవం. క్షమించండి.’’ అని యువకులు కోరుకున్నారు. తమ పిల్లలను క్షమించాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని అటు తల్లిదండ్రులు సైతం క్షమాపణలు కోరారు.

Advertisement

Next Story

Most Viewed