సీతారామ ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి.. మంత్రి తుమ్మల

by Shiva |
సీతారామ ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి.. మంత్రి తుమ్మల
X

దిశ, వెబ్‌డెస్క్ : సీతారామ ప్రాజెక్ట్ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వర‌రావు అన్నారు. ఇవాళ ఆయన సత్తుపల్లి మండలం యాతాలకుంట వద్ద కొనసాగుతున్న ప్రాజెక్ట్ టన్నెల్ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తి అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వ్యాప్తంగా పది లక్షల ఎకరాలకు గోదావరి నీటితో పంట పొలాలు సస్యశ్యామలం అవుతాయని పేర్కొన్నారు. అధికారులు అత్యాధునిక సాంకేతికతను వినియోగించి వేగంగా పనులను పూర్తి చేయాలన్నారు. సీతారామ ప్రాజెక్టులో యాతాలకుంట టన్నెల్ అత్యంత ప్రధానమైందని పేర్కొన్నారు. పనులన్నీ పూర్తయితే.. బేతుపల్లి, లంకాసాగర్‌కు నీళ్లు అందుతాయని తెలిపారు. గండుగులపల్లిలో నాలుగో పంప్ హౌస్ పనులు పురుగతిలో ఉన్నాయని పేర్కొన్నారు.

Advertisement

Next Story