- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యశోద ఆస్పత్రిలో ఆసక్తికర సంఘటన.. నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే? (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన కానుంచి ప్రజల్లోనే ఉంటున్నారు. సమీక్షలు, సమావేశాలతో ఫలు బిజీగా ఉంటూనే.. ఆరు గ్యారెంటీ పథకాల హామీల అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇటీవల మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాలు జారి పడ్డారు. దీంతో ఆయనను సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నారు. ఆయనను పరీక్షించిన వైద్యులు తుంటి ఎముక మార్పిడికి శస్త్రచికిత్స నిర్వహించారు. ఆదివారం యశోద ఆస్పత్రికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ను పరామర్శించారు. కేసీఆర్ కు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి బయటకు వస్తుండగా ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.
దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. రేవంత్ రెడ్డి ఆస్పత్రి నుంచి బయటకు వస్తుండగా ఓ మహిళ అన్నా అని పిలిచి మీతో మాట్లాడాలని కోరింది. దీంతో అది విన్న ఆయన వెనుతిరిగి ఆమె దగ్గరకు వెళ్లి మరీ తన సమస్యను అడిగి తెలుసుకున్నారు. మీ సమస్య ఏమిటో చెప్పాలని అడగడంతో.. ఆమె తన పాప ఆస్పత్రికి సంబంధించిన ఖర్చు చాలా అవుతుందని, కొంచెం సాయం చేయాలని కోరింది. దీంతో వెంటనే స్పందించిన రేవంత్ రెడ్డి ఆ మహిళ సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక దీనికి సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు ఎంత హడావిడిలో ఉన్నా ప్రజల గోడును తెలుసుకున్న వారే అసలైన ముఖ్యమంత్రి అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు