'కేంద్రం నిధులు వినియోగించుకోవడంలో తెలంగాణ ఫెయిల్'

by GSrikanth |
కేంద్రం నిధులు వినియోగించుకోవడంలో తెలంగాణ ఫెయిల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్రం నిధులు వినియోగించుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలం అయిందని కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తాజాగా ఈ శాఖ సమర్పించిన గణాంకాల్లో షాకింగ్ అంశాలు వెలుగు చూశాయి. తెలంగాణలో మహిళలు, చిన్నారులకు రక్షణ లేకుండా పోతోందని, రోజు రోజుకు వారిపై దాడులు పెరుగుతున్నాయని ఈ శాఖ విడుదల చేసిన రిపోర్ట్ స్పష్టం చేసింది. 2020 నుండి 2021 వరకు తెలంగాణలో మహిళలపై లైంగిక వేధింపులు 17 శాతానికి పైగా పెరిగాయని కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సమర్పించిన గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణలో 2021లో మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి 20,865 కేసులు నమోదయ్యాయని, 2020లో 17,791 కేసులు, 2019లో 18,394 కేసులు నమోదయ్యాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే దేశంలోనూ మహిళలు, బాలికలపై లైంగిక నేరాలు పెరిగిపోతున్నాయని ఈ నివేదిక స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 2019లో 4,05,326 కేసులు నమోదు కాగా, 2020లో 3,71,503, 2021లో 4,28,278 కేసులు నమోదయ్యాయి.

పూర్తి నిధులు వినియోగించుకోవడంలో విఫలం:

నిర్భయ నిధులు వినియోగించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2016-17 నుంచి 2021-22 వరకు నిర్భయ నిధుల్లో 16 శాతం వినియోగించుకోవడంలో విఫలమైందని, కేంద్రం రూ.238.06 కోట్లు విడుదల చేస్తే అందులో రాష్ట్రం రూ.200.95 కోట్లు వినియోగించుకుందని పేర్కొంది. ఓ వైపు రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతుంటే మహిళల భద్రత మరియు భద్రతను పెంపొందించడానికి ఉద్దేశించిన కార్యక్రమాలను అమలు చేయడానికి ఏర్పాటు చేసిన ఈ నిధిని పూర్తిస్థాయిలో వినియోగించుకోకపోవడం చర్చగా మారింది. మరోవైపు లైంగిక నేరాల కోసం దర్యాప్తు ట్రాకింగ్ వ్యవస్థను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. నేరాల వివరాలను ట్రాకింగ్ చేయడానికి లైంగిక నేరస్థులపై డేటాబేస్ (ఎన్‌డీఎస్‌ఓ) రూపొందించినట్లు తెలిపింది.

Also Read: 'కేసీఆర్ కలలు కలలుగానే మిగిలిపోతాయి'

Advertisement

Next Story

Most Viewed