- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిరుద్యోగులు ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేయకుండా ప్రజావాణికి రావాలి!.. కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి
దిశ, డైనమిక్ బ్యూరో: నిరుద్యోగ యువకులు కొందరి ప్రొద్బలం వల్లే ఆందోళనలు చూస్తున్నారని, ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేయకుండా ప్రజావాణికి వచ్చి మాట్లాడితే బాగుంటుందని తెలంగాణ ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులు జి. చిన్నారెడ్డి అన్నారు.సెక్రటేరియట్ లోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన నిరుద్యోగుల ధర్నాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు రాజకీయ నాయకులు ఆర్టిఫిషియల్ ఉద్యమాలు చేయిస్తున్నారని, విద్యార్థుల బలిదానం, త్యాగాలను గుర్తించి తెలంగాణను సోనియాగాంధీ ఇచ్చిందని గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 30 వేల ఉద్యోగాలు భర్తీ చేసామని, గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చి, పరీక్షలు రాయడమే కాక రిజల్ట్స్ కూడా వచ్చాయన్నారు.
అలాగే మెయిన్స్ షెడ్యూల్ కూడా ఇచ్చామని తెలిపారు. ఇక 11 వేల పైచిలుకు పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చి, హాల్ టికెట్లు కూడా విడుదల చేశారని, ఈ డీఎస్సీ తో పాటు మరో డీఎస్సీని 9 వేలతో నోటిఫికేషన్ విడుదల చేస్తామని, క్వాలిటి టీచర్స్ ఎంపిక కోసం రెండు డీఎస్సీలను నిర్వహించాలనుకుంటున్నామని తెలిపారు. అంతేగాక 30 లక్షల మంది చదువుకున్న నిరుద్యోగులు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజిలలో పేర్లు నమోదు చేసుకున్నారని, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మరియు ప్రభుత్వ ఉద్యోగాలు కలిపి 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుందని అన్నారు. కోచింగ్ సెంటర్ల వాళ్లు కొంతమంది విద్యార్థులను ప్రేరేపించి ఆందోళన చేయిస్తున్నారని, నిరుద్యోగులు ముఖ్యమంత్రి ఇంటికి పోయి ధర్నా చేయడం సరికాదన్నారు.
విద్యార్థులు, నిరుద్యోగులు బాధ చెప్పుకోవాలనుకుంటే ప్రజావాణికి రావాలని, మీకు అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అంతేగానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయొద్దని కోరారు. ఇక 1: 100, వాయిదా వేయడం, పరీక్షకు పరీక్షకు మధ్య గ్యాప్ వంటి సమస్యలపై కలిసి మాట్లాడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నామని, త్వరలోనే స్కిల్ డెవలప్మెంట్ సెంట్రల్ ఏర్పాటు చేయబోతున్నామని, 30 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఖజానా పూర్తిగా ఖాళీ చేసి వెళ్ళిపోయిందని, ఇలాంటి పరిస్థితులలో కూడా ప్రభుత్వం ఎంతో గొప్పగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీన్ని గురించి విద్యార్ధులు ఆలోచించాలన్నారు. అలాగే విద్యార్థులు తప్పుడు మాటలు విని, తప్పుదోవ పట్టవద్దని కృష్ణారెడ్డి సూచించారు.