- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తమిళనాడులో ముగిసిన తెలంగాణ రవాణా శాఖ అధికారుల పర్యటన
దిశ, తెలంగాణ బ్యూరో: తమిళనాడు రాష్ట్రంలో రవాణాశాఖలో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేయడానికి రెండు రోజుల పర్యటనకు రంగారెడ్డి జిల్లా డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో అధికారుల బృందం వెళ్లింది. మంగళవారం ఆర్టీఓ కార్యాలయాల పనితీరు, నిర్వహణ అంశాలపై అధ్యయనం చేశారు. మీనం బాకం ఆర్టీవో కార్యాలయాన్ని, బెసంత్ నగర్ ఫిట్‌నెస్ సెంటర్‌ని, నేషనల్ ఇన్ ఫర్మేటిక్ సెంటర్‌ను సందర్శించి వాహన్ మరియు సారథి పోర్టల్ ద్వారా వాహనదారులకు అందిస్తున్న సేవల గురించి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా డీటీసీ మాట్లాడుతూ.. ఆటోమెటిక్ టెస్టింగ్ స్టేషన్, రిజిస్ట్రర్డ్ వెహికిల్ స్ర్కాపింగ్ ఫెసిలిటీ, వాహన్, చెక్ పోస్టుల ఎత్తివేత, ఆటెమేటెడ్ డ్రైవింగ్ టెస్టు ట్రాక్స్, డ్రైవింగ్ లైసెన్స్ మరియు ఆర్సీ డిజిటల్ లేక స్మార్ట్ కార్డు, టాక్సెషన్ షెడ్యూల్, గత మూడేళ్ల నుంచి రెవెన్యూ, మెయింటెన్స్ ఆఫ్ సెల్ప్ లైఫ్ ఆఫ్ రికార్డు తదితర అంశాలపై సమాచారం సేకరించామన్నారు. ఆ బృందంలో ఉప్పల్ ఆర్టీవో వాణి, కామారెడ్డి ఎంవీఐ జింగ్లి శ్రీనివాస్ ఉన్నారు. వీరి వెంట తమిళనాడు జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ సురేష్, ఆర్టీఓ సంపత్, శ్రీధర్, ఎంబీఐలు కావేరి, కార్తీక్ తదితరులు ఉన్నారు.