Bonus for Paddy: వడ్లకు రూ.500 బోనస్ కావాలంటే రైతులు ఈ నిబంధనలు పాటించాల్సిందే..!

by Bhoopathi Nagaiah |   ( Updated:2024-10-18 12:29:35.0  )
Bonus for Paddy: వడ్లకు రూ.500 బోనస్ కావాలంటే రైతులు ఈ నిబంధనలు పాటించాల్సిందే..!
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులు పండించిన వడ్లకు రూ.500 బోసన్ ఇస్తామని ఆ పార్టీ ప్రచారం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీల్లోనూ బోనస్‌ను ప్రధానంగా ప్రస్తావించింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత సన్న వడ్లకు మాత్రమే బోనస్ అంటూ రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త మెలిక పెట్టింది. దీని మీద ప్రతిపక్షాలు కొంత ఆందోళన చేసినా వెనక్కి తగ్గని ప్రభుత్వం.. ఆ దిశగానే ప్రతిపాదనలు రెడీ చేసింది. తాజాగా ఏ రకం వడ్లకు బోనస్ ఇవ్వనున్నారో ప్రకటించింది. తెలంగాణ వ్యాప్తంగా 33 రకాలను గుర్తించి వాటికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రకటించారు. అయితే ధాన్యం నాణ్యతతోపాటు పలు నిబంధనలను చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు ఇవే..

సన్నాల్లోని 33 రకాలవరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వనున్నారు. కొనుగోలుకు ముందు ధాన్యం నాణ్యత, గింజ పొడవు, వెడల్పును పరిశీలించనున్నారు. ఇందుకు గాను ప్రతి కొనుగోలు కేంద్రంలో మైక్రో మీటర్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వరి గింజ పొడవు 6 మిల్లీ మీటర్లు, వెడల్పు 2 మిల్లీ మీటర్లకంటే ఎక్కువ కాకుండా ఆ లోపే ఉండాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. అలాగే ధాన్యం తేమ 17 శాతానికి లోపు ఉంటేనే బోనస్ వర్తిస్తుందని తెలిపింది. ఈ నిబంధలనపై వ్యవసాయ శాఖ రైతులకు అవగాహన కల్పించడంలో నిమగ్నమైంది. మండల వ్యవసాయ అధికారులు, ఏఈఓలు గ్రామాల్లో తిరుగుతూ రైతులకు వివరిస్తున్నారు.

బోనస్ వచ్చే వడ్ల రకాలు ఇవే..

  • 1. సిద్ది (WGL 44)
  • 2. కంపాసాగర్ వరి-1 (KPS 2874)
  • 3. సాంబ మసూరి (BPT 5204)
  • 4. జగిత్యాల వరి-3 (JGL 27356)
  • 5 వరంగల్ సాంబ (WGL 14)
  • 6. వరంగల్ సన్నాలు (WGL 32100)
  • 7. జగిత్యాల మసూరి (JGL 11470)
  • 8. పాలాస ప్రభ (JGL 384)
  • 9. క్రిష్ణ (RNR 2458)
  • 10. మానేరు పోన (RNR 15048)
  • 11. వరంగల్ వరి - 1119
  • 12. కూనారం వరి-2 (KNM 1638)
  • 13. వరంగల్ వరి-2 (WGL 962 )
  • 14. రాజేంద్రనగర్ వరి-4 (RNR 21278)
  • 15. కూనారం-1(KNM 733)
  • 16. జగిత్యాల సన్నాలు (JGL 1798)
  • 17. జగిత్యాల సాంబ (JGL 3844)
  • 18. కరీంనగర్ సాంబ (JGL 3855)
  • 19. అంజన (JGL 11118)
  • 20. నెల్లూరు మసూరి (NLR 34449)
  • 21. ప్రత్యుమ్న (JGL 17004)
  • 22. సుగంధ సాంబ (RNR 2465)
  • 23. శోభిని (RNR 2354)
  • 24. సోమనాథ్ (WGL 347)
  • 25. ఆర్ఎన్ఆర్ 31479 (PRC)
  • 26. కేపీఎస్ 6251 (PRC)
  • 27. JGL 33124 (PRC)
  • 28. HMT Sona
  • 29. మారుటేరు సాంబ (MTU 1224)
  • 30. మారుటేరు మసూరి (MTU 1262)
  • 31. MTU 1271
  • 32. జగిత్యాల వరి -2 (JGL 28545)
  • 33. తెలంగాణ సోన (JGL 3828)
Advertisement

Next Story

Most Viewed