బ్రేకింగ్: ముగిసిన తెలంగాణ ఎలక్షన్స్.. మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్

by Satheesh |   ( Updated:2023-11-30 13:33:15.0  )
బ్రేకింగ్: ముగిసిన తెలంగాణ ఎలక్షన్స్.. మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటలకు ముగిసింది. 5 గంటల లోపు పోలింగ్ బూత్‌లలో క్యూలో ఉన్న ఓటర్లకు మాత్రం ఓటు వేసే అవకాశం ఇస్తామని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. 5 గంటల తర్వాత వచ్చిన ఓటర్లను పోలింగ్ బూత్‌లలోకి అనుమతించమని తేల్చి చెప్పారు. తెలంగాణ ఎన్నికల పోలింగ్ ముగియడంతో తెలంగాణతో పాటు ఇటీవల ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఏ రాష్ట్రంలో ట్రెండ్ ఎలా ఉంది.. ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపారు, ఏ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది అనే విషయాలపై పలు మీడియా సంస్థలు, సర్వే సంస్థలు ఎగ్జిట్స్ పోల్స్ రిలీజ్ చేయనున్నాయి. మరికొన్ని నిమిషాల్లో విడుదల కానున్న ఎగ్జిట్స్ పోల్స్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Next Story