హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రద్దు

by Javid Pasha |
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రద్దు
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రస్తుత కమిటీకి బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీని రద్దు చేస్తూ మంగళవారం సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుత కమిటీ స్థానంలో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మాజీ జడ్జి లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. తక్షణమే ప్రస్తుత కమిటీ రద్దు అవుతుందని, ఇక నుంచి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వ్వవహారాలను ఏక సభ్య కమిటీ చూసుకుంటుందని దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది.

Advertisement

Next Story