కొండగట్టుకు మహర్దశ.. రూ.100 కోట్లు కేటాయిస్తూ సర్కార్ జీవో విడుదల

by Satheesh |   ( Updated:2023-02-13 14:10:30.0  )
కొండగట్టుకు మహర్దశ.. రూ.100 కోట్లు కేటాయిస్తూ సర్కార్ జీవో విడుదల
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జగిత్యాల జిల్లాలోని సుప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.గతంలో జగిత్యాల కలెక్టరేట్ ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఆలయ అభివృద్ధికి మంగళవారం సర్కార్ నిధులు విడుదల చేసింది. స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వంద కోట్ల నిధులను తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధి పనుల జాబితా పంపించాలంటూ జిల్లా కలెక్టర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Next Story