- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజా పాలనకు ఆరు నెలలు.. ఆరు గ్యారంటీలు మాత్రం అమలు కాలే: ఎంపీ రఘునందన్ రావు
దిశ, వెబ్ డెస్క్: మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలల పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అందులో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజాపాలన( ఆరు గ్యారంటీల) దరఖాస్తుల అమలు గురించి ప్రశ్నించారు. ఎంపీ రఘునందన్ రావు తన ట్వీట్‌లో... "ఇవి గుర్తున్నాయా ఎవరికైనా?? రాష్ట్ర ప్రజలు లైనులో నిలబడి ఫామ్ నింపి ఆరు నెలలు అయింది. కానీ ఆరు గ్యారంటీలు మాత్రం అమలుకాలే!! పార్టీ ఫిరాయింపుల మీద ఉన్న శ్రద్ధ ఇచ్చిన హామీల మీద లేకపాయే !! ఇదేనా తెలంగాణ లో ప్రజా పాలనా అంటే ?? అంటూ ప్రశ్నించారు. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా గెలిచిన నాయకులు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరగా, 9 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అలాగే మరికొంతమంది కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.