విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం.. ఎస్ఎఫ్ఐ

by Javid Pasha |
విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం.. ఎస్ఎఫ్ఐ
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో సోమవారం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం ముట్టడికి జిల్లా నాయకులు విద్యార్థులు యత్నించారు. విద్యార్థి నాయకులకు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాటలతో ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకోని అరెస్టుచేసి ముషిరాబాద్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యి 15 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ప్రభుత్వ విద్యారంగ సమస్యలు పరిష్కారం కాలేదని అన్నారు.

ప్రభుత్వం దశాబ్ధి ఉత్సవాలు భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో యూనిఫాం, పాఠ్యపుస్తకాలు అందిస్తామని చెప్పి గోప్పగా ప్రకటించిన ఇప్పటికీ రాష్ట్రంలో యూనిఫామ్ రాలేదన్నారు. తెలంగాణ విద్యాదినోత్సవానికి కూడా పాత బట్టలతోనే విద్యార్థులు హాజరైయారని తెలిపారు. రెండు జతలు యూనిఫామ్ ఇస్తామన్నా ఇప్పటికీ అందించలేదన్నారు. అధ్యాపకులు లేకుండా,పాఠ్యపుస్తకాలు లేకుండా చదువులు ఎలా అని ప్రశ్నించారు. ఈ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యురాలు మమత, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు లెనిన్ గువేరా, రాష్ట్ర కమిటీ సభ్యురాలు రమ్య, ఉపాధ్యక్షులు ప్రశాంత్, స్టాలిన్, శ్రీమాన్ తదితరులు పాల్గొన్నారు.



Next Story