- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఆరోగ్య మహిళ’కు ఆదరణ.. మూడు మంగళవారాల్లో 19 వేల మందికిపైగా స్క్రీనింగ్
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని మహిళలంతా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్న సంకల్పంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. ప్రతి మంగళవారం మహిళలకు మాత్రమే వైద్య పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 100 ‘ఉమెన్ స్పెషల్ క్లినిక్స్’ను ఏర్పాటు చేశారు. గడిచిన మూడు మంగళవారాల్లో మొత్తం 19వేల మందికిపైగా మహిళలకు వైద్య పరీక్షలు చేశారు. ‘
మహిళ ఆరోగ్యం-ఇంటి సౌభాగ్యం’ అనే లక్ష్యంతో ఈ వైద్య కేంద్రాల్లో మహిళలు ఎదుర్కొంటున్న ఎనిమిది ప్రధాన ఆరోగ్య సమస్యలకు సంబంధించిన పరీక్షలు చేసి, చికిత్స అందిస్తున్నారు. తీరిక లేకనో, భయం కారణంగానో, సరైన అవగాహన లేకనో, సొంతంగా ఆస్పత్రికి వెళ్లలేకనో, ఇతర కారణాలతోనో తమ అనారోగ్య సమస్యలను బయటపెట్టుకోరు. దీంతో వారి ఆరోగ్య సమస్యలు ముదిరి, పెద్ద వ్యాధులకు దారి తీస్తున్నాయి. ఇలాంటివారికి ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమం కొండంత భరోసా ఇస్తుంది.
క్రమంగా పెరుగుతున్న ఆదరణ
ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8వ తేదీన ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కరీంనగర్‌లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 14వ తేదీ నుంచి ఆరోగ్య పరీక్షలు ప్రారంభం అయ్యాయి. మొదటి వారం 4,793 మంది మహిళలు తరలివచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ నెల 21వ తేదీన 6,328 మంది వచ్చారు. ఓపీ 32 శాతం పెరిగింది. 28వ తేదీన మరింత పెరిగి 7,965 మందికి స్క్రీనింగ్ నిర్వహించారు.
అంతకుముందు వారంతో పోల్చితే 26 శాతం మంది అధికంగా వచ్చారు. మూడు మంగళవారాల్లో కలిపి 10 వేలకుపైగా నమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. మొదటి వారం 2,723 నమూనాలను సేకరించగా, రెండో వారం 2,792 నమూనాలను, మూడోవారం 4,727 నమూనాలను సేకరించి తెలంగాణ డయాగ్నోస్టిక్స్‌కు పంపించారు. ఈ ఫలితాలు 24 గంటల్లోనే వారికి అందుతున్నాయి.
మహిళలు సద్వినియోగం చేసుకోవాలి
మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆరోగ్య మహిళ’ను సద్వినియోగం చేసుకోవాలి. ఉమెన్ స్పెషల్ క్లినిక్స్‌కు ఆదరణ పెరుగుతున్నది. మహిళలు ప్రధానంగా ఎదుర్కొంటున్న ఎనిమిది రకాల ఆరోగ్య సమస్యలను గుర్తించి వైద్యం అందిస్తున్నాం. అక్రిడేటెడ్ మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక వైద్య శిబిరాన్ని హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్‌లో గల సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యాలయం వద్ద ఏర్పాటు చేశాం. ఈ సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నాను. - హరీశ్ రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి