టీచర్ల బదిలీల ప్రక్రియ.. సర్కారు కీలక ప్రకటన

by Sathputhe Rajesh |   ( Updated:2023-08-31 13:12:16.0  )
టీచర్ల బదిలీల ప్రక్రియ.. సర్కారు కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: టీచర్ల బదిలీల ప్రక్రియకు సంబంధించి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. కోర్టు తీర్పునకు లోబడి బదిలీలు చేయాలని అధికారులను ఆదేశించారు. పారదర్వకతతో బదిలీల ప్రక్రియ నిర్వహించాలన్నారు. బదిలీల ప్రక్రియ విధి, విధానాలను రూపొందించాలని అధికారులకు మంత్రి సబిత ఆదేశించారు. బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలని టీచర్లకు సమాచారం ఇవ్వాలన్నారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సెప్టెంబర్ 3 నుంచి టీచర్ల బదిలీల ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు. అక్టోబర్ 3 లోపు టీచర్ల పదోన్నతులు, బదిలీలు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రేపు లేదా ఎల్లుండి టీచర్ల బదిలీలకు షెడ్యూలు విడుదల కానుంది. బదిలీలు, పదోన్నతుల షెడ్యూలును పాఠశాల విద్యాశాఖ విడుదల చేయనుంది. కాగా టీచర్ల బదిలీల అంశమై నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

Read More..

పండగవేళ వీఓఏలకు తెలంగాణ సర్కారు తీపికబురు

Advertisement

Next Story

Most Viewed