ఎంఐఎంకు ఇచ్చే ప్రియార్టీ తమకు ఇవ్వడం లేదంటూ.. బీఆర్ఎస్ క్యాడర్ ఫైర్

by Sathputhe Rajesh |
ఎంఐఎంకు ఇచ్చే ప్రియార్టీ తమకు ఇవ్వడం లేదంటూ.. బీఆర్ఎస్ క్యాడర్ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : తమకు పార్టీ‌లో గుర్తింపు లేదని, లోకల్ క్యాడర్, గ్రౌండ్ లీడర్లకు ప్రీయార్టీ ఇవ్వడం లేదని బీఆర్ఎస్ కేడర్ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రౌండ్ లెవల్ సమస్యల‌పై ప్రభుత్వం ఫోకస్ పెట్టాలని డిమాండ్ చేశారు. తమ డివిజన్లలో ప్రజా సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోమంత్రులు తలసాని, మహమూద్ అలీ ముందే తేల్చి చెప్పారు.

గ్రేటర్ సిటీలో ఎంఐఎంకు ఇచ్చే ప్రీయార్టీ బీఆర్ఎస్ క్యాడర్‌కు ఇవ్వడం లేదని కార్యకర్తలు, నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అందరిని కలుపుకొని వెళ్లాలని కొందరికే న్యాయం జరుగుతుందన్న క్యాడర్ మండిపడ్డారు. సొంత పార్టీ నేతలనే నిలదీశారు. కష్టపడే వారికి గుర్తింపు లభించడం లేదని మండిపడ్డారు. గ్రేటర్‌లోని స్లం ఏరియాలో ఉన్న సమస్యల పరిష్కరించాలని.. పలుమార్లు నేతల దృష్టికి తీసుకుపోయినా పరిష్కరించడం లేదన్నారు.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనైనా సమస్యలపై దృష్టి సారించాలన్నారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తలను గుర్తించాలని కోరారు. లేకుంటే పార్టీకి నష్టం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి గుర్తింపు ఇస్తున్నారని. మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి గుర్తింపు ఇవ్వడం లేదని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే సాయన్న విగ్రహం ఏర్పాటు చేయాలని.. ఫ్లెక్సీలలో సైతం ఆయన ఫోటో పెట్టాలని డిమాండ్ చేశారు.

మంత్రి తలసాని సీరియస్

మంత్రి శ్రీనివాస్ యాదవ్ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేనికి అరుస్తున్నారు దేనికి చప్పట్లు కొడుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడాలి. కానీ ఎవరు పడితే వారు మాట్లాడితే ఎట్లా అని మండిపడ్డారు. కార్యకర్తలకు గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story