పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద మాజీ ఎమ్మెల్యేను అడ్డుకున్న పోలీసులు

by Anjali |
MLA Balka Suman
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. గురువారం (నిన్న) ప్రారంభమైన నామినేషన్లు రెండో రోజుకే జోరు పెరిగింది. ఇకపోతే నేడు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ నామినేషన్ వేయనున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. కానీ బాల్క సుమన్‌ను గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారు. ఎంపీ అభ్యర్థి వెంట ఐదుగురు మాత్రమే కార్యాలయంలోకి వెళ్లాలని ఆదేశాలు ఉండటంతో బాల్క సుమన్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఇక నేడు మహాబూబ్ నగర్ జిల్లా నుంచి చల్లా వంశీచందర్ రెడ్డి కూడా నామినేషన్ వేయనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకావడం విశేషం. కార్యాక్రమం అనంతరం రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed