Telangana: ఏళ్ల తరబడి ఎదురుచూపులతో.. అలసి నేలకొరిగిన వృద్ధ దంపతులు

by Indraja |
Telangana: ఏళ్ల తరబడి ఎదురుచూపులతో.. అలసి నేలకొరిగిన వృద్ధ దంపతులు
X

దిశ వెబ్ డెస్క్: దొరల కబంధహస్తాల్లో చిక్కుకున్న తెలంగాణ విముక్తికై, అనగారిన పేదల బతుకుల్లో వెలుగు నింపుటకై, విద్యార్థులు పెన్ను వదిలి గన్ను పట్టిన, అడవి తల్లి ఒడిలో, పేద ప్రజల గుండెల్లో నివసిస్తూ, గడీల పాలనను నిలదీస్తూ, దొరలపాలనను అంతమొందించే కథలతో తెలంగాణ నేపథ్యంలో అనేక సినిమాలు తెరకెక్కిన విషయం అందరికీ తెలిసిందే. ఇలా అప్పటి తెలంగాణ దయనీయతను, దాన్ని ఎందిరించేందుకు పోరాడే ఓ యువతి, తన ప్రమేయం లేకుండానే నక్సలైట్‌గా ముద్రపడిన ఓ విద్యార్ధి, పట్నంలో చదువు కుంటున్న కొడుకు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూసే తల్లి ప్రాధాన పాత్రలుగా ప్రేక్షుల హృదయాలను కదిలించిన ఎన్‌కౌంటర్ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది.

అయితే ఈ చిత్రంలో జరిగినట్టే నిజ జీవితంలో సైతం జరుగుతుందా అంటే.. అవుననే చెప్పాలి అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయానికి వస్తే..రాజన్న సిరిసిల్లజిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లికి చెందిన నారాయణ, భూదమ్మ దంపతులకు తుమ్మల శ్రీనివాస్‌ అలియాస్‌ విశ్వనాథ్‌ అనే కొడుకు ఉన్నారు. తమ కొడుకు బాగా చదువుకుని తమని భాగా చూసుకుంటారని ఆ దంపతులు ఆశపడ్డారు.

అయితే వాళ్ల ఆశలు అడియాశలయ్యాయి. శ్రీనివాస్‌ సిద్దిపేటలో డిగ్రీ చదువుతూ.. కళాశాల నుండి 1998లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అప్పటి నుండి కన్న కొడుకు ఏమయ్యాడో తెలియక ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఒకటి కాదు రెండు కాదు ఎకంగా 26 సంవత్సరాలుగా కొడుకు కోసం ఎదురు చూస్తూనే కన్నుమూశారు.

నక్సలైట్‌‌గా మారిన కొడుకు.. కౌన్సెలింగ్‌ ఇచ్చిన పోలీసులు

కన్న కొడుకు ఏమయ్యాడో తెలియక తల్లిడిల్లుతున్న తల్లిదండ్రుల చెంతకు పోలీసులు వచ్చారు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్‌ సీపీఐ(ఎంఎల్‌) జనశక్తి నక్సలైట్‌ గ్రూపులో చేరి అడవిబాట పట్టాడు అని చెప్పారు. తనకు తానుగా వచ్చి లొంగిపోయేలా కొడకుని ప్రేరేపించాల్సిందిగా ఆ దంపతులకు కౌన్సెలింగ్‌ ఇచ్చిట్టు తెలుస్తోంది. పోలీసులు చెప్పిన వార్తతో ఆ దంపతుల గుండెల్లో గుబులు పుట్టింది.

అప్పటి నుండి చిన్న అలికిడైనా కొడుకు వచ్చాడోమోనని గుమ్మం వైపు పరుగులు తీసేవారని, ఎక్కడ ఎన్‌కౌంటర్ జరిగినా తమ కొడుకుకు ఏమైనా అయ్యిందా అని కంగారు పడే వారని సమాచారం. తమ కొడుకు రాకపోతాడా కడసారి చూడకపోతామా అని కొండంత ఆశతో కల్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూశారు. అలా కొడుకు కోసం ఎదురు చూస్తూనే 2017లో తల్లి భూదమ్మ చనిపోయింది.

ఈ నేపథ్యంలో కన్న కొడకు ఎక్కడ, ఎలా ఉన్నాడో తెలీదు. తోడుగా ఉన్న భార్య మరణించింది. దీనితో నారాయణ మనోవేదనకు గురయ్యారని సమాచారం. ఆ మనోవేదనతో కొడుకును చూడాలి అనే చివరి కోరిక తీరకుండానే జూన్ 23న నారాయణ తుది శ్వాస విడిచారు. కాగా బుధవారం నారాయణ దశదినకర్మ జరగనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అజ్ఞాతంలో ఉన్న శ్రీనివాస్‌ ఆచూకీ గురించి జనశక్తి అగ్రనేతలు సైతం చెప్పలేకపోవడం గమనార్హం.

Next Story