ప్రీతి మృతిపై హెచ్‌ఆర్సీకి ఓయూ జేఏసీ ఫిర్యాదు

by GSrikanth |
ప్రీతి మృతిపై హెచ్‌ఆర్సీకి ఓయూ జేఏసీ ఫిర్యాదు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మెడికో విద్యార్థిని ప్రీతి మృతిపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ చైర్మన్ సురేష్ యాదవ్ సోమవారం ఫిర్యాదు చేశారు. ప్రీతి మరణంపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్, పంజాగుట్ట సీఐ ప్రీతి కుటుంబం పట్ల దురుసుగా ప్రవర్తించారని ఈ సందర్భంగా ఆరోపించారు. నిపుణులతో పోస్ట్ మార్టం నిర్వహించాలని కోరినప్పటికీ కింది స్థాయి సిబ్బందితో పోస్ట్ మార్టం నిర్వహించారని మండిపడ్డారు.

పోలీసుల తీరు సరికాదని, ప్రీతి ఆత్మహత్యకు పాల్పపడిందా లేక హత్య చేశారా అనేది తేల్చాలని కోరారు. ఈ అంశంపై త్వరలో గవర్నర్ ను కూడా కలవబోతన్నట్లు వెల్లడించారు. కాగా ప్రీతి సూసైడ్ వ్యవహారంపై జాతీయ ఎస్సీ కమిషన్ ఇప్పటికే రంగంలోకి దిగింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వారం రోజుల్లో సమర్పించాలని వరంగల్ పోలీసులను ఆదేశించింది.

Advertisement

Next Story