- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రాఫిక్ పోలీస్ అవతారం ఎత్తిన వృద్దురాలు!.. ఆమె మాటలు వింటే షాక్
దిశ, డైనమిక్ బ్యూరో: ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు బిజీ బిజీ జీవితాలు గడుపుతున్న ఈ రోజుల్లో.. నిలిచిపోయిన ట్రాఫిక్ ను చూసి నాకెందులే అనుకోకుండా ఓ వృద్దురాలు ట్రాఫిక్ పోలీస్ అవతారం ఎత్తింది. కర్ర పట్టుకొని వాహాన దారులను హెచ్చరిస్తూ.. రోడ్డుపై నిలిచిన ట్రాఫిక్ ను క్లియర్ చేసింది. జగిత్యాల పట్టణంలో మార్కెట్ ఏరియాలోని మెయిన్ స్ట్రీట్ లో నిత్యం ట్రాఫిక్ తో బిజీబీజీగా ఉంటుంది. ఆ మార్కెట్ లోనే పుత్లీ అనే వృద్దురాలు రోడ్డు పక్కనే గొడుగు పెట్టుకొని వీధి వ్యాపారం చేసుకుంటుంది. ఈ నేపధ్యంలోనే శుక్రవారం కూడా ట్రాఫిక్ ఎక్కువ అయ్యి రోడ్లపై వాహానాలు నిలిచి హారన్ మోతలు మోగిస్తున్నాయి.
దీంతో విసుగు చెందిన ఆ వృద్దురాలు ట్రాఫిక్ పోలీస్ అవతారం ఎత్తింది. తన వ్యాపారాన్ని సైతం పక్కకు పెట్టి కర్ర పట్టుకొని రోడ్డు ఎక్కింది. రోడ్డుపై అడ్డంగా వస్తున్న వాహనాలను హెచ్చరిస్తూ.. చిన్న గల్లీల్లో నుంచి వచ్చే వాహానాలను నిలిపివేసి మెయిన్ స్ట్రీట్ లోని వాహానాలను ఖాళీ చేయించించింది. అనంతనం గల్లీ వాహానాలను దారి మల్లించి ట్రాఫిక్ ను పూర్తిగా క్లియర్ చేసింది. ఆమె ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న సమయంలో పోలీస్ వాహానంలో అటుగా వచ్చిన అధికారులు ఆమెను చూస్తూ వెళ్లిపోయారు. ఇలా ఎందుకు చేస్తున్నావ్ అని అడగగా.. ట్రాఫిక్ క్లియర్ చేయకపోతే ప్రమాదాలు జరుగుతాయని, అందుకే నిత్యం ఇలాగే చేస్తూ ఉంటానని బదులు ఇచ్చింది. దీంతో ట్రాఫిక్ పోలీసుల డ్యూటీని ఈ బామ్మ చేస్తున్నందుకు అందరూ మెచ్చుకుంటున్నారు.