ఉధృతంగా గోదావరి ఉరకలు.. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు

by Rajesh |
ఉధృతంగా గోదావరి ఉరకలు.. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు
X

దిశ, మంగపేట : మూడు రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉగ్ర రూపం దాల్చి ఉరకలు పెడుతుంది. మండలంలోని కమలాపురం బిల్ట్ ఇంటెక్ వెల్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికకు సమీపంలో గోదావరి ప్రవహిస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మండలంలోని కమలానురం ఎర్రవాగు, మండల కేంద్రంలోని పొద్మూరు, గౌరారం వాగు లోతట్టు ప్రాంతమైన సినిమాహాల్ వడ్డెర కాలనీ, బీసీ కాలనీలతో పాటు నర్సాపురం బోరు రైస్ మిల్లు, చుంచుపల్లి, వాడగూడెం, రాజుపేట ముసలమ్మవాగు లోతట్టు ప్రాంతం, కత్తిగూడెం, బ్రాహ్మణపల్లి, అకినేపల్లి మల్లారం గ్రామాల్లోని గోదావరి ముంపు, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను రెవిన్యూ, పోలీస్అ ధికారులు అప్రమత్తం చేయడంతో పాటు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలిచ్చారు. గోదవరి ఉగ్రరూపంతో వరద పొంగిపొర్లుతుండడంతో శనివారం మండలంలో జిల్లా కలెక్టర్ దివాకర, ఇరిగేషన్, రెవిన్యూ, పోలీస్ అధికారుల బృంధం పర్యటించనున్నట్లు తెలిసింది. వర్షం మరో రెండు రోజులు ఇలాగే కొనసాగితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed