ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అనూహ్య పరిణామం.. ఈడీ కస్టడీకి నందకుమార్‌

by Satheesh |   ( Updated:2022-12-24 14:09:07.0  )
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అనూహ్య పరిణామం.. ఈడీ కస్టడీకి నందకుమార్‌
X

దిశ, డైనమిక్ బ్యూరో: సంచలనం సృష్టిస్తున్న ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో శనివారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు నందకుమార్‌ను ప్రశ్నించేందుకు ఈడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ విచారణ జరుపుతుండగా మరో వైపు ఈ కేసులో మనీలాండరింగ్‌పై ఈడీ ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా నంద కుమార్‌ను మూడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. అయితే నందును ఒక రోజు మాత్రమే కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో సోమవారం చంచల్ గూడ జైలులో నందకుమార్ స్టేట్ మెంట్‌ను ఈడీ అధికారులు రికార్డు చేయనున్నారు.

Advertisement

Next Story