బ్రేకింగ్: అత్యంత విషమంగా మెడికో ప్రీతి హెల్త్ కండీషన్

by Satheesh |
బ్రేకింగ్: అత్యంత విషమంగా మెడికో ప్రీతి హెల్త్ కండీషన్
X

దిశ, వెబ్‌డెస్క్: వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజ్‌లో మెడికో ప్రీతి ఆత్మాహత్యయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీతికి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా, శుక్రవారం ఉదయం వైద్యులు ప్రీతి హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. మెడికో ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలిపారు. వెంటిలేటర్, ఎక్మోపై చికిత్స అందిస్తున్నామన్నారు. గుండె, కిడ్నీల ఫంక్షనింగ్ కొంత మెరుగుపడిందని తెలిపారు. ప్రీతి శరీరం చికిత్స స్పందిస్తుందని వెల్లడించారు. ప్రీతిని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక డాక్టర్ల బృందం ప్రీతికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story